JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకునే బాధ్యత నాది అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. చిల్పూరులో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ BRS బలోపేతానికి కృషి చేయాలన్నారు.