MHBD: మున్సిపాలిటీ పరిధిలోని కంబాలపల్లి చెరువులో శుక్రవారం ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేపల వ్యాపారం ద్వారా మత్స్యకారులు వ్యాపారులుగా ఎదగాలని తెలిపారు. మత్స్య సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు వెల్లడించారు.