VKB: పరిగి మండలంలోని బాలాజీ మెడికల్లో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. సయ్యద్పల్లికి చెందిన నవీన్ తన ఏడేళ్ల కుమారుడు నియాన్కు వాంతులు అవుతుండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. అత్యవసరంగా వైద్యుడిని కలవాలని కోరగా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బయటకు నెట్టారు. అంతటితో ఆగక, తమ స్నేహితులను పిలిచి బాధితుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.