ADB: దొంగతనం కేసులో పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్ వద్ద నుంచి రెండు వెండి పట్టిలను, పలు రోల్డ్ గోల్డ్ ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. 2 రోజుల్లో దొంగతనం కేసును చేదించి ఇద్దరు దొంగలను పట్టుకోవడంతో SP అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.