KMM: నోయిడా కార్మికుల పోరాటానికి సంఘీభావంగా CITU ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం నగరంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. యూపీ, హర్యానా రాష్ట్రాల్లో కనీస వేతనాలు, హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం,వేధించడం దారుణమన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న అణచివేత ధోరణిని వీడలన్నారు.