NLG: రేషన్ బియ్యంను కిరాణా షాపుల వాళ్లు కొనడం,అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రఘునందన్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మునుగోడులో కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కిరాణా దుకాణాలు రేషన్ బియ్యం దందాకు కేరాఫ్ అడ్రస్‌గా మారితే.. ఆ దుకాణాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.