HYD: ఖైరతాబాద్ పోలీసుల అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డీజీపీ ఆదేశాల మేరకు సైక్లోథాన్ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. సెంట్రల్ డీసీపీ శిల్పవల్లి ‘సైక్లోథాన్’ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి సెవెన్ టూంబ్స్ వరకు సైక్లోథాన్ నిర్వహించారు.