WNP: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దేవరకద్ర శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా మదనపురం మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.