ASF: ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్‌కి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 క్రికెట్ క్రీడాకారుల కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అతను ప్రతిభ కనబర్చాడు. బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ ఎంపికతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.