JGL: ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో రూ.16 లక్షల 55 వేల విలువగల 17 కళ్యాణ లక్ష్మి చెక్కులను, 67 సీఎం సహాయనిది చెక్కులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.