BDK: కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ప్రధాన రహదారి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లపై వర్షం నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు దాటే క్రమంలో కారు కింది భాగం రోడ్డుకు తగిలి వాహనం పాడైపోతుందని వాహనదారులు శనివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.