KNR: సీజేఐ గవాయిపై జరిగిన దాడిని యావత్తు దళిత సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని MRPS KNR ఇంఛార్జ్ మంద రాజు మాదిగ అన్నారు. రామడుగులో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాకేశ్ కిషోర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్‌లో జరిగే భారీ నిరసన కార్యక్రమానికి మండల ప్రజలు రావాలన్నారు.