MBNR: శాలివాహనుల త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. శాలివాహన జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాలివాహనులు సాంస్కృతిక వారసత్వ సంపదను అందించారని వెల్లడించారు. కుల సంఘాల బలపేతానికి కృషి చేయాలన్నారు.