NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి (NFBS) అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం చండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. 59 సంవత్సరాల లోపు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే అర్హులైన కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేలు అందించడం జరుగుతుందని తెలిపారు.