NLG: దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులను బుధవారం అందజేశారు. నల్గొండ ఆర్ఎం కార్యాలయంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, ఆర్ఎం కొణతం జానిరెడ్డి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కింద రూ. 25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు.