KMR: కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 100 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. డీఈవో రాజు వందో అడ్మిషన్ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు గంగా కిషన్‌ను, ఉపాధ్యాయ బృందం పని తీరును డీఈవో అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన అన్నారు.