JGL: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని వాటర్ గ్రిడ్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, వాటర్ గ్రిడ్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం శుద్ధి చేసిన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు.