WNP: గత నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించిన సుమన్ షోటోకాన్ కరాటే బ్లాక్ బెల్ట్ టెస్ట్‌లో పెబ్బేరు శ్రీను కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కరాటే మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ పరీక్షలో రిషికేష్, కార్తీక్ బ్లాక్ బెల్ట్ విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. కలర్ బెల్ట్ విభాగంలో జోషిక, నైనా, సాయిసుధన్ పాసయ్యారు. విజేతలకు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా బెల్టులు అందజేశారు.