JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యాపారవేత బచ్చు రామచంద్రం ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీచేశారు. ఇంట్లో ఎవరులేని సమయంలో ఈ చోరికి పాల్పడ్డారు. అలాగే పద్మ మెడికల్ షాపు వద్ద బైకు ఎత్తుకెళ్లారు. ఓకేరోజు రాత్రి 2చోరీలు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.