KNR: ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుతంగా దూసుకెళ్తుంది. లీగ్ దశలో భాగంగా జరిగిన తొలి పోరులో సంగారెడ్డిపై 48 పాయింట్లు, రెండో మ్యాచ్లో వరంగల్ జట్టుపై 21 పాయింట్ల తేడాతో గెలుపొందింది. వరుస విజయాలతో సత్తా చాటిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ అభినందించారు.