ADB: జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం బజారాత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.