JN: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు జరగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జాఫర్ ఘడ్, స్టేషన్ ఘనపూర్ మండలాల్లోని అర్హులైన లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పరంగా అమలయ్యే ఏ పథకమైనా రూపాయి ఖర్చు లేకుండా అర్హులకు చేరాలని, అవినీతికి అవకాశం ఇవ్వకుండా సర్పంచులు పనిచేయాలన్నారు.