KMR: మద్నూర్ మండల కేంద్రంలో అక్రమంగా మోరం దందా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఓ ప్రైవేటు స్థలంలో పెద్ద ఎత్తున మోరం రవాణా జరిగింది. ఇదే విషయమై తహశీల్దార్ ఎండి ముజీబ్ను చరవాణి ద్వారా సంప్రదించగా కార్యాలయం పనివేళలో మోరం రవాణాకు అనుమతి ఉందని సెలవు రోజులో అనుమతి లేదని స్పష్టం చేశారు.