NZB: జిల్లాలోని మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనుమానం, డబ్బుల గొడవతో ఐదుగురు వ్యక్తులు కలిసి రిషిక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు.