BDK: రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని సూచించారు.