MHBD: సంక్రాంతి సెలవుల సందర్బంగా ఇళ్లను వదిలి వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ సూచించారు. ఇళ్లకు తాళలు వేసి వెళ్లేటప్పుడు పొరుగు వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంట్లో నగదు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, ఇంటి ముందు, వెనుక లైటు వెలిగేలా చూడాలని కోరారు.