WGL: మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని WGL జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ సూచించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న సహారా మిషన్ ద్వారా బైకులు, ఈ-బైకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గలవారు ఈ నెల 5 నుంచి 10 వరకు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.