HYDలో బంగారం పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ఇది ఒరిజినల్ బంగారం అని నమ్మించి, కొందరు అమాయకుల్ని ఆకట్టుకుంటున్నారు. బంగారం పెట్టి, డబ్బులు అప్పుగా తీసుకుని మోసం చేస్తున్నారు. తర్వాత ఆ బంగారం నకిలీ అని బయట పడుతోంది. ఇటీవలి కాలంలో 9 ఘటనలు నమోదయ్యాయి. బంగారం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.