NLG: అంజనపల్లి గ్రామ పరిధిలోని పాల్తీ తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ మెట్లు కూలిపోయే స్థితికి చేరడంతో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించిన ఈ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.