ASF: కాగజ్ నగర్ పట్టణ ఈద్గా వద్ద రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో MLC విఠల్ శనివారం పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించి ఆత్మశుద్ధితో పవిత్ర పండుగను జరుపుకుంటారన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు.