JGL: విజయదశమి పర్వదినం సందర్భంగా రాయికల్ పట్టణ కేంద్రంలో దుర్గా అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర వైభవపీతంగా జరిగింది. పాఠశాల విద్యార్థులతో నెలకొల్పిన శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో ప్రత్యేక వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ముస్తాబు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మహిళల మంగళహారతులతో స్వాగతం పలికారు.