NZB: ప్రభుత్వ పౌర సరఫరాల స్టాక్ పాయింట్‌ను మోస్రా తహసీల్దార్ రాజశేఖర్ సోమవారం తనిఖీ చేశారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు వర్ని మండలంలోని మండల స్థాయి ఆహార ధాన్యాల నిల్వలను పరిశీలించారు. ధాన్యం బస్తాల తూకం సక్రమంగా ఉన్నాయా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. చౌక ధరల దుకాణాలకు పంపిణీ చేసే ఆహార ధాన్య బస్తాలు పక్క దారికి వెళ్లకుండా చూడాలని ఆదేశించారు.