KDP: జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ (DRC) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ శ్రీధర్, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై అధికారులతో మంత్రి చర్చించారు.