ADB: రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు, పిడుగుపాటు మరణాలు వంటి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి బాధిత కుటుంబాలకు సాయం చేయాలని సూచించారు.