కృష్ణా: బ్రదర్ జోసఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా పెద్ద అవుటపల్లి పుణ్యక్షేత్రం భక్తిప్రపత్తులతో పరవశిస్తోంది. వేడుకల్లో భాగంగా బుధవారం నాటికి నవదిన ప్రార్థనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సభలో ఫాదర్ పూదోట దాసయ్య ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. క్రైస్తవుల ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగాలని వివరించారు.