KDP: చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి తర్వాత ఉపాధి హామీ పథకం పేరు మారుతుందన్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్లు, పశువుల షెడ్లు ఇతర పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.