JGL: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం హామీని ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.