BHNG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే CPM అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బండారు నరసింహ అధ్యక్షతన పార్టీ చౌటుప్పల మున్సిపల్ సంయుక్త సమావేశం నిర్వహించారు.