ADB: బీజేపీ, కాంగ్రెస్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం మావల మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి జోగు రామన్న కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు.