KNR: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో గతుకులమయమైన రోడ్డును తాత్కాలికంగా మరమ్మతు చేయడానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు గుంతలమయమై ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో శుక్రవారం మట్టి పోసి రోడ్డును చదును చేసే పనులు ప్రారంభించారు.