SRD: జహీరాబాద్ మున్సిపాలిటీ పనితీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగారెడ్డిపల్లి అండర్ బ్రిడ్జి కింద మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీనిపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదని విమర్శించారు.