KMM: బోనకల్ మండలం గోవిందపురం ఎల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో చర్చి సిలువను కూల్చివేసి ఎన్ఎస్పీ కాలువలో పడేశారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ మద్దెల రమాదేవి శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచనామా చేసి సిలువను స్వాధీనం చేసుకున్నారు.