KMR: కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలం వరకు డీలక్స్ బస్సును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ శుక్రవారం తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.