AP: కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు పర్యాటక ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టు, విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, అనంతపురంలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. RTC బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయించింది.