TPT: సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా MLA నెలవల విజయశ్రీ, అసిస్టెంట్ కమిషనర్ (జీఎస్టీ) సుబ్బారావు పాల్గొన్నారు. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై వినియోగదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం తగ్గించిన జీఎస్టీ ప్రకారమే వ్యాపారులు వస్తువుల అమ్మకాలు చేయాలని MLA సూచించారు.