MDK: మెదక్ పట్టణంలో తాగునీటి కొరత సమస్యను పరిష్కరించడానికి అమృత్ 2.0 పథకం కింద సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఐదు నీటి ట్యాంకుల నిర్మాణ పనులను ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటి ట్యాంకుల నిర్మాణం ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.