మేడ్చల్: చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రిపురం నాగార్జునకాలనీకి చెందిన సబిత ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 303 ర్యాంక్ సాధించి DSPగా ఎంపికైంది. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి నివాసానికి వెళ్లి గ్రూప్-1 విజేతను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సబిత విజయం బంజారా జాతికే గర్వకారణం అని, తనను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.