MBNR: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను ప్రభుత్వ సలహాదారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చించినట్టు ఆయన వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలను గురించి కూడా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.