ASR: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. పీపీపీ ద్వారా తనవారికి లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. శుక్రవారం అరకులో కోటి సంతకాల పోస్టర్లను ఆవిష్కరించారు. 45 రోజులకు పైగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం వైసీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు.