MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని ద్వారక, ధర్మారావుపేట, తదితర గ్రామాలలో ఆయన పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. గ్రామ కార్యదర్శులకు సూచనలు చేశారు.